మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, శుక్రవారం ఆదిలాబాద్ టిటిడీసీలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను సాధారణ ఎన్నికల పరిశీలకులు డి. హనుమంత్ నాయక్, కలెక్టర్ రాజర్షిషా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ రాజు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.