ఆదిలాబాద్ హమాలివాడ అర్బన్ హెల్త్ సెంటర్‌లో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని కలెక్టర్ రాజర్షి షా లాంఛనంగా ప్రారంభించారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ బండారి అనూషతో కలిసి చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన ఆయన, గతంలో పిల్లలకు పోలియో చుక్కలు వేసినప్పటికీ, ప్రస్తుతం కూడా వేయించాలని సూచించారు. 2013 నుంచి ఇప్పటివరకు పోలియో కేసులు లేవని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో సాధన, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, కౌన్సిలర్ పద్మవార్ రాకేశ్ పాల్గొన్నారు.