విత్తన, ఎరువుల దుకాణాల్లో ముమ్మర తనిఖీలకు కలెక్టర్ ఆదేశం

10చూసినవారు
విత్తన, ఎరువుల దుకాణాల్లో ముమ్మర తనిఖీలకు కలెక్టర్ ఆదేశం
రానున్న వానకాలం సాగు సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు. శనివారం ఆదిలాబాద్ కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ నుండి మండల వ్యవసాయ అధికారులకు గూగుల్ మీట్ నిర్వహించి సాగు సన్నద్ధత, ఎరువుల నిల్వలు, ఇతర అంశాలపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా విత్తనాలు, ఎరువుల లభ్యతలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. జిల్లాలో నకిలీ విత్తనాలు, ఎరువుల విక్రయాలను అరికట్టేందుకు తక్షణమే ప్రత్యేక తనిఖీ బృందాలను (స్క్వాడ్స్) ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్