మున్సిపల్ వార్డు సభలో పాల్గొన్న కలెక్టర్

1చూసినవారు
ఆదిలాబాద్‌లోని 45వ వార్డులో నిర్వహించిన వార్డు సభలో కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారమే ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష, అదనపు కలెక్టర్ రాజేశ్వర్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. నీటి సంరక్షణ చర్యలు తీసుకోవాలని, భూగర్భ జలాలు ఇంకిపోకుండా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు. చెత్తను తడి, పొడి, సానిటరీ, ఈ వేస్ట్ గా వేరు చేసి మున్సిపల్ వాహనాల్లో వేయాలని, ప్లాస్టిక్‌ను నిషేధించాలని ఆదేశించారు.