ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎన్నికల కోడ్ నియమావళిని ఉల్లంఘించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా ను కలిసి ఫిర్యాదు చేశారు. పంచాయతీ ఎన్నికల సమయంలో ఏకగ్రీవం అయ్యే పంచాయతీలకు రూ.25 లక్షలతో అభివృద్ధికి సహకరిస్తానని ఎమ్మెల్యే ప్రసంగించడం ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించడమేనని ఫిర్యాదులో పేర్కొన్నారు.