అదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలంలోని సాటిలైట్ సెంటర్ కొలంగూడ ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో స్కూల్ కాంప్లెక్స్ సమావేశం గురువారం నిర్వహించారు. కాంప్లెక్స్ హెడ్మాస్టర్, ఎస్సిఆర్పి కే ఈటా, సి ఆర్పి ల పర్యవేక్షణలో జరిగిన ఈ సమావేశానికి కాంప్లెక్స్ పరిధిలోని ఉపాధ్యాయులందరూ హాజరయ్యారు. ఈ సమావేశంలో విద్యా ప్రమాణాల మెరుగుదల, రాబోయే విద్యా విషయాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్సిఆర్పి కే ఈటా మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమయపాలన కచ్చితంగా పాటిస్తూ టిఎల్ఎం ద్వారా విద్యాబోధన చేయాలని వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచనలు చేయడం జరిగింది.