ఆదిలాబాద్ జిల్లాలో భూమి కొనుగోలు, విక్రయాలకు సంబంధించిన చట్టాలు, రెవెన్యూ రికార్డులు, భూమాఫియా నేరాల నివారణపై పోలీసు అధికారులకు అవగాహన కల్పించేందుకు ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ తరపున భీంపూర్ తహసీల్దార్ నలందప్రియ పాల్గొని, భూమి యాజమాన్య చరిత్ర, గత భూ చట్టాలు, పాస్‌బుక్, టైటిల్ డీడ్, పట్టాదార్ పాస్‌బుక్, పహాని, ఎంకంబరెన్స్ సర్టిఫికేట్ వంటి ముఖ్య రికార్డుల ప్రాముఖ్యతను వివరించారు. విలేజ్ మ్యాప్, టిప్పన్, సేత్వార్ వంటి ప్రాథమిక రికార్డులను పరిశీలించడం అవసరమని సూచించారు.