హెల్మెట్ ధరించిన వారికి పూలతో అభినందనలు

1చూసినవారు
రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా, ఆదిలాబాద్‌లో ఆర్టీవో అధికారులు, ట్రాఫిక్ పోలీసులు కలిసి వాహనదారులకు అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించి నిబంధనలు పాటిస్తున్న వారికి పూలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమం ద్వారా ఇతరులకు స్ఫూర్తినివ్వాలని అధికారులు ఆకాంక్షించారు. ఏఎంవిఐలు హరీంద్ర కుమార్, రంజిత్, ట్రాఫిక్ సీఐ ప్రణయ్ కుమార్ పాల్గొని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్