ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిందని హైదరాబాద్‌లో అన్నారు. అసెంబ్లీలో ప్రశ్నలు అడిగితే ఎగతాళి, ఎదురుదాడి చేశారని, వందేమాతరం గేయాన్ని అవమానించిన వారిని అనర్హులుగా ప్రకటించాలని, కానీ వారిని ఫ్యానెల్ స్పీకర్‌గా కూర్చోబెట్టి రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అవమానించిందని ఆయన ఆరోపించారు. నిధులు ఇవ్వకుండా ఎస్సీ, ఎస్టీల హక్కులను కాల రాస్తున్నారని విమర్శించారు.