కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఇచ్చోడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహమూద్ ఖాన్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నాయకులు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ ఓ మంచి నాయకుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహమూద్ ఖాన్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.