కాంగ్రెస్ నేతలు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి: బీఆర్ఎస్

0చూసినవారు
కాంగ్రెస్ నేతలు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి: బీఆర్ఎస్
మాజీ మంత్రి జోగు రామన్నపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలను బీఆర్ఎస్ నాయకుడు గణేశ్ తీవ్రంగా ఖండించారు. ఆదిలాబాద్ లో గురువారం ఆయన మాట్లాడుతూ, ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధికి జోగు రామన్న హయాంలోనే పునాదులు పడ్డాయని, అనేక అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రతినిధి గోవర్దన్‌ రెడ్డి రాజకీయ లబ్ధి కోసమే అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవాలు తెలుసుకుని విమర్శలు చేయాలని ఆయన హితవు పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్