కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకనే మాజీ మంత్రి జోగురామన్న ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ ఆదిలాబాద్ అధికార ప్రతినిధి బాలూరి గోవర్దన్ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటనపై మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. బుధవారం మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేంద్ర నిధులను దుర్వినియోగం చేశారని, కొరాట చనక ప్రాజెక్ట్ నిర్వాసితులకు మాజీ మంత్రి చేసిందేమీ లేదని ఆరోపించారు.