ఆదిలాబాద్‌లో అతిపెద్ద ఎయిర్‌పోర్టు నిర్మాణం: కేంద్ర మంత్రి

12చూసినవారు
ఆదిలాబాద్‌లో అతిపెద్ద ఎయిర్‌పోర్టు నిర్మాణం: కేంద్ర మంత్రి
దేశవ్యాప్తంగా విమానాశ్రయాలపై వస్తున్న డిమాండ్లను పరిశీలిస్తున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. మామునూరు విమానాశ్రయానికి మరో 3 నెలల్లో శంకుస్థాపన చేయాలని, ఆదిలాబాద్, కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనలను కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఆదిలాబాద్‌లో అతిపెద్ద విమానాశ్రయం నిర్మించాలని, దీనికి రక్షణ శాఖకు చెందిన 300 ఎకరాల భూమిని సివిల్ ఏవియేషన్‌తో కలిసి జాయింట్ వెంచర్‌కు సిద్ధంగా ఉందని రక్షణ శాఖ చెప్పినట్లు తెలిపారు. ఆదిలాబాద్‌ విమానాశ్రయానికి రాష్ట్ర ప్రభుత్వం 450 ఎకరాలు ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్