ఆదిలాబాద్ రిమ్స్ లో జరిగిన ఘటన చాలా బాధకరమణి 7వార్డు కౌన్సిలర్ రాము, 8 వార్డు కౌన్సిలర్ నాగసేన్, 10 వార్డు కౌన్సిలర్ సతీష్ యాదవ్ లు అన్నారు. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఘటన నేపథ్యంలో మంగళవారం ప్రొద్దున ఆసుపత్రిని సందర్శించారు. చిన్న పిల్లల వార్డును పరిశీలించి ఘటనకు సంబందించిన వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వారి వెంట లింగంపల్లి శశికాంత్, ఎల్చాలా పోచన్న, ముస్లె ఈశ్వర్, అఖిల్, వినయ్ లు ఉన్నారు.