కార్యదర్శుల బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియ

0చూసినవారు
ఆదిలాబాద్ కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో గ్రామపంచాయతీ కార్యదర్శుల బదిలీల కౌన్సిలింగ్ జరిగింది. అదనపు కలెక్టర్ రాజేశ్వర్ పర్యవేక్షణలో సీనియార్టీ ఆధారంగా ఈ ప్రక్రియను చేపట్టారు. ఒకే చోట నాలుగేళ్లకు పైగా పనిచేస్తున్న కార్యదర్శులకు స్థానచలనం కల్పించారు. కార్యదర్శులు తమకు నచ్చిన ఆప్షన్లను ఎంచుకునేలా, పారదర్శకంగా గ్రామాలను కేటాయించారు. ఈ కార్యక్రమంలో డీపీవో రమేశ్, డీఎల్పీవో ఫణీందర్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :