పబ్లిక్ స్థలాలలో అనుమతి లేకుండా ఫ్లెక్సీలను పెట్టినవారు చట్టరీత్యా శిక్షార్హులు, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్ వన్ టౌన్ లో మున్సిపల్ కమిషనర్ సివిఎన్ రాజుతో కలిసి మీడియాతో మాట్లాడారు. నియమాలు ఉల్లంఘించిన వారిపై న్యాయస్థానంలో సంవత్సరం వరకు జైలు, ఐదువేల జరిమానా వరకు శిక్ష ఉంటుందన్నారు. ఫ్లెక్సీలు వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు.