ఆదిలాబాద్‌లోని ఖుర్షీద్‌నగర్‌కు చెందిన ఇటుకబట్టి యజమానిని సైబర్ మోసగాడు స్కానర్, ఓటీపీ పేరుతో మోసం చేశాడు. ఇటుకలు కావాలని చెప్పి సరుకు తీసుకున్న తర్వాత, స్కానర్ పంపించి డబ్బులు జమ అవుతాయని నమ్మించి ఓటీపీ తెలుసుకున్నాడు. బాధితుడు ఓటీపీ చెప్పగానే అతని బ్యాంకు ఖాతా నుంచి రూ.87,500 నగదు మాయమైంది. మోసగాడిని సంప్రదించే ప్రయత్నాలు విఫలమవడంతో బాధితుడు టూ టౌన్ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశాడు.