కేంద్ర ప్రభుత్వం 'సర్' పేరుతో దివ్యాంగుల ఓట్లను తొలగిస్తుందని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆరోపించింది. ఈ అన్యాయాన్ని నిరసిస్తూ ఈనెల 13న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ధర్నా చేపట్టనున్నట్లు జిల్లా అధ్యక్షుడు నగేష్ తెలిపారు. ఆదిలాబాద్‌లోని సంఘం కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ, నిరసన కార్యక్రమానికి దివ్యాంగులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.