రేపు కలెక్టరేట్ ఎదుట ధర్నా

2చూసినవారు
రేపు కలెక్టరేట్ ఎదుట ధర్నా
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టం స్థానంలో తీసుకొచ్చినట్లు చెబుతున్న వీబీజీ రాంజీ చట్టాన్ని రద్దు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లంక రాఘవులు తెలిపారు. ఈ మేరకు జూలై 1న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని, కొత్త చట్టం అమలైతే ఉపాధి కూలీలకు పని అవకాశాలు తగ్గి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన పేర్కొన్నారు. కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై 1న ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ఉపాధి కూలీలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్