ఆదిలాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (డీఎంహెచ్‌ఓ) రాథోడ్ నరేందర్ గురువారం త్రినేత్ర డయాగ్నోస్టిక్ సెంటర్‌ను తనిఖీ చేశారు. డయాగ్నోస్టిక్ కేంద్రాల నిర్వాహకులు నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆయన సూచించారు. స్కానింగ్ కోసం వచ్చిన గర్భిణుల పూర్తి వివరాలు, ప్రసవ అంచనా తేదీ వంటి సమాచారాన్ని రిజిస్టర్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. అనంతరం రికార్డులను పరిశీలించారు.