ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, సమగ్ర ఓటరు సవరణ ప్రక్రియ (ఎస్. ఐ. ఆర్) తో ఓట్లు తొలగిపోతాయని ప్రజలలో, రాజకీయ పార్టీ నేతల్లో ఉన్న అపోహలను విడనాడాలని బుధవారం సూచించారు. ఉమ్మడి జైనథ్ మండలం పెండల్వాడలో ఇంటింటి సర్వేను బుధవారం పరిశీలించిన ఆయన, అర్హులైన ఏ ఒక్కరి ఓటు తొలిగిపోదని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో అదనపు కలెక్టర్ చిత్రు, ఎస్. ఐ. ఆర్ ఇంచార్జీ నలంద ప్రియ, తహసిల్దార్ బాబు సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రక్రియలో అర్హులైన ఒక్క ఓటు కూడా తొలగిపోదని కలెక్టర్ హామీ ఇచ్చారు.