విద్యారంగం పట్ల నిర్లక్ష్యంగా వహించవద్దు

504చూసినవారు
విద్యారంగం పట్ల నిర్లక్ష్యంగా వహించవద్దు
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్రనాథ్ యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు. జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఆందోళనకు స్పందించి ప్రభుత్వం నిధులు విడుదల చేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆదిలాబాద్ లో ఆర్. కృష్ణయ్య ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో గన్నోజి విజయ్, నిఖిలేష్ ఖత్రి, విట్టల్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్