
తిరుమలలో రేపు, ఎల్లుండి వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
వేసవి సెలవులు ముగిసి, వారాంతం రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. అధిక సంఖ్యలో భక్తులకు దర్శనాలు కల్పించేందుకు జూన్ 28, 29వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. అదేవిధంగా, ఆన్ లైన్ కరెంట్ బుకింగ్ లో జారీ చేసే 800 శ్రీవాణి దర్శన టికెట్లను కూడా ఈ రెండు రోజులు రద్దు చేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్మెంట్లు, బయట క్యూలైన్లు బాలాజీ నగర్ వరకు నిండిపోయాయి. టీటీడీ అధికారులు భక్తులకు సౌకర్యాలు కల్పిస్తూ, ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు.




