పదోన్నతి పొందిన ఉద్యోగులు మంచిగా పని చేసి సహకార శాఖ అభివృద్ధికి కృషి చేయాలని టీఎన్జీవో జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్ కోరారు. ఇటీవల సహకార శాఖలో జూనియర్ అసిస్టెంట్ నుండి సీనియర్ అసిస్టెంట్ గా పదోన్నతులు కల్పిస్తూ అడిషనల్ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు పదోన్నతులు పొందిన దిరేష్, శరత్, ఆశా జ్యోతి లను టీఎన్జీవో యూనియన్, గెజిటెడ్ అధికారుల సంఘం ఆదిలాబాద్ లో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు కె. శివ కుమార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ లు నవీన కళా, ఆరతి, గౌస్ బాబా, స్వప్న , సీనియర్ ఇన్స్పెక్టర్లు లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.