నార్నూర్ మండల కేంద్రంలో ఆదివారం రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన, పరిశ్రమల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదివారం పర్యటించారు. ఈ సందర్బంగా ఏజెన్సీ ప్రాంతమైన నార్నూరుకు విద్యాసంస్థ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. అనంతరం కోలాందరి, ఎంపల్లి ప్రాజెక్టులపై ఇరిగేషన్ మంత్రితో మాట్లాడి మంజూరు చేయిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సుగుణ, శ్యామ్ నాయక్, గజానంద్, పరమేశ్వర్, సురేష్ ఆడే పాల్గొన్నారు.