మున్సిపల్ ఎన్నికల విధుల్లో అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రం అలసత్వం వహించినా సహించబోమని ఆదిలాబాద్ కలెక్టర్ రాజార్షిషా హెచ్చరించారు. మున్సిపాలిటీకి జరగనున్న రెండవ సాధారణ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో మైక్రో అబ్జర్వర్లు, జోనల్ అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియలో మైక్రో అబ్జర్వర్లు, జోనల్ అధికారుల పాత్ర కీలకమని, ప్రతి అధికారి ఎన్నికల నియమావళిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, పోలింగ్ కేంద్రాల్లో తలెత్తే సమస్యలను తక్షణమే పరిష్కరించేలా సిద్ధంగా ఉండాలని సూచించారు.