నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు: కలెక్టర్ సూచన

577చూసినవారు
నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు: కలెక్టర్ సూచన
ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా జిల్లాలోని నిరుద్యోగ యువత ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధి రంగాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆదిలాబాద్‌లోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు. నేటి పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలని కలెక్టర్ నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ అనూష, AMC ఛైర్మన్ శ్రీకాంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్