పర్యావరణ పరిరక్షణ మనందరి సామాజిక బాధ్యత అని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రాబోయే 99 రోజుల్లో జిల్లా వ్యాప్తంగా అడవులను రక్షించాలని, ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటి దానిని బాధ్యతగా కాపాడాలని పిలుపునిచ్చారు. తద్వారా జిల్లాలో పచ్చదనాన్ని పెంపొందించి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.