సామాజిక సేవలో ప్రతి ఒక్కరు ముందుండాలి

5చూసినవారు
సామాజిక సేవలో ప్రతి ఒక్కరు ముందుండాలి
సామాజిక సేవలో ప్రతి ఒక్కరూ ముందుండాలని సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రి అన్నారు. సామాజిక సేవలకు గాను కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్న ఆయనను శనివారం ఆదిలాబాద్ లోని మార్వాడి ధర్మశాలలో సమితి మహిళా కమిటీ ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.