ఆదిలాబాద్ జిల్లాలో మార్క్ ఫెడ్ ద్వారా ప్రభుత్వ మద్దతు ధరతో మొక్కజొన్న కొనుగోళ్లు వేగవంతమయ్యాయి. జిల్లా కలెక్టర్ రాజర్షిషా తెలిపిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు రూ. 52.34 కోట్ల విలువైన 2.18 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్నను సేకరించారు. రైతులకు సకాలంలో చెల్లింపులు జరపాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు, హైదరాబాద్‌లోని మార్క్ ఫెడ్ ప్రధాన కార్యాలయం నుండి ఆదిలాబాద్ జిల్లా కార్యాలయానికి రూ. 31.08 కోట్ల నిధులు విడుదలయ్యాయి. చెల్లింపుల ప్రక్రియను అత్యంత వేగవంతం చేశామని కలెక్టర్ పేర్కొన్నారు.