ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల, ఏటీసీ కేంద్రాల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును జులై 10వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. జూన్ 30తో ముగిసిన గడువును ఉన్నతాధికారులు పొడిగించారని పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన
విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, కళాశాలలో వివిధ రకాల ట్రేడ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు.