ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి శివారులో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, వారి వద్ద నుంచి 150 నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లు, రూ.60 వేల నగదు, ఒక ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జిట్టావార్ కిషోర్ రెడ్డి, రక్తావర్ పవన్, నవగరే కునాల్, కుల్దీప్ టాక్రేలు ఈ కేసులో అదుపులోకి తీసుకున్న నిందితులు. వీరు గుజరాత్‌కు చెందిన కంపెనీ పేరుతో నకిలీ విత్తనాలను అసలైనవిగా చిత్రీకరించి రైతులకు అమ్ముతున్నట్లు విచారణలో తేలింది. రైతులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.