అడవి పందుల బెడదతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. బోథ్ మండలం దాబా బి గ్రామానికి చెందిన రైతు గుండాజీ తనకున్న 10 ఎకరాల్లో మక్క పంట సాగు చేయగా, అందులో సుమారు 5 ఎకరాల పంటను అడవి పందులు పూర్తిగా ధ్వంసం చేశాయి. చేతికందిన పంట కళ్లముందే నాశనం కావడంతో రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. అడవి పందుల దాడితో సుమారు రూ. 1 లక్ష వరకు నష్టం వాటిల్లిందని తెలిపారు. ప్రభుత్వం స్పందించి పంట నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం అందించి ఆదుకోవాలని రైతు కోరారు.