ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం డోంగర్ గాం గ్రామానికి చెందిన పలువురు రైతులకు ఎర్ర చందనం మొక్కలు, సోలార్ ఫెన్సింగ్, సీసీ కెమెరాలు, బోరుబావులు వేయిస్తామని నమ్మించి సుమారు రూ.5.20 లక్షలు వసూలు చేసిన ఆంధ్రప్రదేశ్కు చెందిన హేమంత్కుమార్, ముద్ది రాల అనంట్లు అనే ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఉట్నూర్ సీఐ మడావి ప్రసాద్, ఇంద్రవెల్లి ఎస్ఐ సాయన్నలు తెలిపారు. అక్టోబర్, నవంబర్ 2025లో ఈ మోసం జరిగినట్లు, మొక్కలు ఇవ్వకుండా తిరుగుతున్న వారిపై రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం వారిని అరెస్ట్ చేసి, రెండు ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.