అధిక వర్షపాతం కారణంగా రైతులు ఎదుర్కొన్న నష్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విపత్తుగా ప్రకటించి తక్షణం పరిహారం చెల్లించాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. అదిలాబాద్ లో శనివారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పండించిన పంటకు దిగుబడి రాక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కష్టకాలంలో రైతులను ఆదుకోవడం ప్రభుత్వాల బాధ్యతగా పేర్కొన్నారు.