రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అస్తవ్యస్త విధానాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ రాష్ట్ర నాయకురాలు సుహాసిని రెడ్డి విమర్శించారు. గురువారం ఆదిలాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ, అన్నదాతలు రోడ్డెక్కితే తప్ప ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. ఎన్నికల హామీలను విస్మరించారని, తక్షణమే రైతుల వద్ద ఉన్న పంటను కొనుగోలు చేసి ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.