ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో మార్కెట్లో డిమాండ్ ఉన్న ఉద్యానవన పంటలను రైతులు సాగు చేయడంపై దృష్టి సారించాలని సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రైతు వారోత్సవాల సందర్భంగా హార్టికల్చర్ రిసెర్చ్ సెంటర్‌లో వ్యవసాయ సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు సదస్సు జరిగింది. ఈ సదస్సును కలెక్టర్ రాజర్షిషా, మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ ఛైర్‌పర్సన్ అనూషతో కలిసి ప్రారంభించారు.