బోథ్ క్రాస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం.. బాలుడు, డ్రైవర్ మృతి

8చూసినవారు
బోథ్ క్రాస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం.. బాలుడు, డ్రైవర్ మృతి
ఆదిలాబాద్ జిల్లా బోథ్ క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సు రెండో డ్రైవర్ రవిసింగ్‌ (50) మరియు 4 ఏళ్ల బాలుడు నిసాద్ అక్కడికక్కడే మృతి చెందారు. బాలుడి తల్లిదండ్రులు సారిక, సోనులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఎస్ఐ ఇమ్రాన్ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్