శంకర్‌గూడాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

201చూసినవారు
ఇంద్రవెల్లి మండలం శంకర్‌గూడా సమీపంలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గుడిహత్నూర్‌ నుంచి ఇంద్రవెల్లి వెళ్తున్న బైక్‌ను ఆదిలాబాద్‌ వైపు వస్తున్న ఉట్నూర్‌ డిపో ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్