మత సామరస్యాన్ని కాపాడుతూ, ఇతరుల మనోభావాలను కించపరచకుండా పండుగలను నిర్వహించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. మంగళవారం ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఖురేషి కులస్తులతో, డిఎస్పీ కార్యాలయంలో హిందూ సంఘాలు, గోరక్షక సమితి సభ్యులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. ఖురేషి కులస్తులకు సరైన అనుమతులుంటేనే పశువులను సంహరించాలని, ఆవులను ఎట్టి పరిస్థితుల్లోనూ సంహరించవద్దని తెలిపారు. హిందూ సంఘాల ప్రతినిధులతో మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని, అపోహలు, వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించారు.