ఇంద్రవెల్లి మండలం మేండపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని దుర్వగూడా గ్రామంలో సోమవారం మడావి శ్రీకాంత్ ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. ఈ ప్రమాదంలో 30 క్వింటాళ్ల పత్తి పంటతో పాటు ఇతర వస్తువులు కూడా కాలిపోయాయి.