ఆదిలాబాద్ జిల్లాలో ఐదు చెక్ పోస్టులు

0చూసినవారు
ఆదిలాబాద్ జిల్లాలో ఐదు చెక్ పోస్టులు
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను ఎస్పీ అఖిల్ మహాజన్ తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, అక్రమ మద్యం, నగదు, బహుమతుల తరలింపును అడ్డుకోవాలని ఆయన ఆదేశించారు. ఐదు ఎస్‌ఎస్‌టి చెక్ పోస్టులలో 24 గంటలూ వాహనాలను తనిఖీ చేస్తారని, రూ.50 వేలకు మించిన నగదు ఉంటే సరైన పత్రాలు చూపాలని సూచించారు. ఈ తనిఖీల్లో డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐలు స్వామి, ఫనిధర్, ఎస్ఐ విష్ణువర్ధన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్