ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో బుధవారం నిర్వహించిన వాకథాన్‌ను అదనపు కలెక్టర్ రాజేశ్వర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాణ్యమైన, పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించవచ్చని సూచించారు. ప్రస్తుత కాలంలో ఆహారంలో రసాయనాల వాడకం పెరిగిందని, దీనివల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక ఆరోగ్య వారోత్సవాలలో భాగంగా ఆహార భద్రత శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.