గ్రామ అభివృద్ధి పేరుతో వసూళ్లు చేయడం చట్టవిరుద్ధమని, అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గత ఏడాది పలు కేసులు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు, కల్లు దుకాణాలు, ఇసుక తవ్వకాలకు అనధికారిక అనుమతులు ఇవ్వడం వీడీసీలకు అర్హత లేదని, వారి అనుమతితో చట్టవ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిపై, వీడీసీలపై కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.