ఆదిలాబాద్ మున్సిపాలిటీలో గత పాలకులు అభివృద్ధిని అడ్డుకుంటూ కమిషన్లకు పాల్పడ్డారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. మాజీ కౌన్సిలర్ అందె శ్రీదేవి, పలువురు యువకులు, మహిళలు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి, ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీలో చేరారు. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు.