త్వరలో కారెక్కనున్న డీసీసీ మాజీ అధ్యక్షులు ?

972చూసినవారు
త్వరలో కారెక్కనున్న డీసీసీ మాజీ అధ్యక్షులు ?
జిల్లా కాంగ్రెస్ సీనియర్ యువ నేత, డీసీసీ మాజీ అధ్యక్షుడు భార్గవ్ దేశ్పాండే బీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. పిన్న వయస్సులోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో క్రియాశీల నేతగా ఎదిగిన భార్గవ్ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించడంతో ఆయనతో పాటు మరికొందరికి పార్టీ సస్పెండ్ చేసింది. మళ్ళీ పార్టీలో చేరినప్పటికీ కొంతకాలంగా పార్టీకి దూరంగానే ఉంటున్నారు. తాజాగా జిల్లాకు చెందిన మాజీ మంత్రి జోగు రామన్న నేతృత్వంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసినట్లు సమాచారం. దీంతో ఈనెల 12న భార్గవ్ కారెక్కనునట్లు పక్కా సమాచారం.

సంబంధిత పోస్ట్