ఆదిలాబాద్: మాజి ఎమ్మెల్యే కుంజా బొజ్జు సేవలు మరువలేనివి

81చూసినవారు
ఆదిలాబాద్: మాజి ఎమ్మెల్యే కుంజా బొజ్జు సేవలు మరువలేనివి
ప్రజా సమస్యల పరిష్కారానికి అలుపెరగని ఉద్యమాలు చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యే, సీపీఎం సీనియర్ నేత కుంజా బొజ్జుకే దక్కుతుందని పార్టీ ఏరియా కమిటీ అధ్యక్షుడు లంక రాఘవులు పేర్కొన్నారు. శనివారం మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జు 4వ వర్ధంతిని ఆదిలాబాద్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవకే అంకితమయ్యారని కొనియాడారు. ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు

సంబంధిత పోస్ట్