ఆదిలాబాద్ జిల్లా జైలు నుండి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బెయిల్ పై విడుదలయ్యారు. క్యాతన్ పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల సమయంలో రాష్ట్ర మంత్రి వివేక్ కాన్వాయ్ పై దాడి కేసులో ఆయనను పోలీసులు అరెస్టు చేసి 14 రోజుల పాటు జైల్లో రిమాండ్ కు తరలించారు. బుధవారం ఆయన విడుదల కావడంతో మాజీ మంత్రి జోగు రామన్న తోపాటు బిఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో జైలు వద్దకు చేరుకున్నారు.