మావలలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్: ప్రజలకు వైద్య సేవలు

2చూసినవారు
అదిలాబాద్ మండలం మావల గ్రామంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్ట్స్ మరియు కామర్స్ వారి ఆధ్వర్యంలో ఏడు రోజులపాటు నిర్వహించే జాతీయ సేవా పథకంలో భాగంగా ఆదివారం 5వ రోజున ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అతిక్ బేగం అధ్యక్షత వహించి, వాలంటీర్లు చేపట్టిన కార్యక్రమాలను వివరించి, ప్రజలు ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డాక్టర్ సుమలత, డాక్టర్ శ్యాంప్రసాద్, డాక్టర్ భాగ్యలక్ష్మి, డాక్టర్ అవినాష్, డాక్టర్ చరిత్ వైద్యులు గ్రామస్తులకు వివిధ పరీక్షలు చేసి, మందులను సూచించారు. ఎన్ఎస్ఎస్ క్యాంపు ద్వారా వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ రఘు గణపతి, ఎన్ఎస్ఎస్ పీవోలు, బోధన సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్