పోలీసులు మీకోసం లో కార్యక్రమంలో భాగంగా మే 4 నుంచి 30 వరకు ఉచిత సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఆదిలాబాద్, నార్నూర్, బోథ్, ఇంద్రవెల్లి, ఇచ్చోడ అనే 5 చోట్ల ఈ క్యాంపులు జరుగుతాయి. రెండవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఆయా పోలీసు స్టేషన్లలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ క్యాంపులలో పిల్లలకు వివిధ క్రీడాంశాలలో శిక్షణ అందించడం జరుగుతుందని పేర్కొన్నారు.